ఘనంగా ఎస్బీఐ లైఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
MNCL: మంచిర్యాలలో ఎస్బీఐ లైఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ లైఫ్ అడ్వైజర్స్ బోడ ధర్మేందర్, తౌటి మల్లేష్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం బ్రాంచ్ మేనేజర్ యాదగిరి రెడ్డి మాట్లాడుతూ.. ఎస్బీఐ లైఫ్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.