ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి

BPT: బల్లికురవ మండలం మల్లాయపాలెం గ్రానైట్ క్వారీ ప్రమాదంలో ఆదివారం ఆరుగురు కార్మికులు మృతి చెందిన నేపథ్యంలో ప్రమాద సంఘటనపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంకట మురళితో మాట్లాడి సహాయ చర్యలపై అరా తీశారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి రవికుమార్ ఆదేశించారు.