ప్రమాదం: రహదారిపై అదుపుతప్పిన బస్సు

ప్రమాదం: రహదారిపై అదుపుతప్పిన బస్సు

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామ సమీపంలోని అక్కమ దేవి మలుపు వద్ద శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి రోడ్డుపై అడ్డం తిరిగింది.  అతివేగం కారణంగా జరిగిన ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే దాదాపు రెండు గంటల పాటు ఘాట్‌ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, పోలీసులు పరిస్థితిని నియంత్రిస్తున్నారు.