ప్రధానమంత్రి ఫ్లెక్సీకి పాలాభిషేకం..

KRNL: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతు సంక్షేమానికి పెద్ద పీట వేశారని బీజేపీ రాష్ట్ర కిషన్ మోర్చ ఉపాధ్యక్షులు హేమ సుందర్ రెడ్డి, నాయకులు రామయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో హేమ సుందర్ మాట్లాడుతూ.. ఇవాళ డోన్ పట్టణంలో పీఎం కిసాన్ 20 విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ కావడంతో హర్షం వ్యక్తం చేశారు. రైతులు, బీజేపీ నాయకులు కలిసి ప్రధానమంత్రి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసినట్లు తెలిపారు.