VIDEO: 'ఇసుక అక్రమ రవాణపై చర్యలు తీసుకోండి'
NZB: బోధన్ మండలం కండ్గావ్ శివారులో మంజీరా నది నుంచి రాత్రి వేళల్లో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మాఫియాదారులు ఇసుకను టిప్పర్ల ద్వారా మహారాష్ట్రకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ రవాణాను అడ్డుకున్న వారిపై దాడులకు తెగబడుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.