'జల సంరక్షణకు నడుంబిగించాలి'
KNR: వైశ్య భవన్‌లో మానేరు పర్యావరణ సమితి ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ కొలగని శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 'సుజలాం సుఫలాం' కార్యక్రమం గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. జల సంరక్షణ కోసం నడుంబిగించాలని సూచించారు. ఎండాకాలం తాగునీరు లేక ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.