తెగి పడ్డ విద్యుత్ వైర్లు.. తప్పిన ప్రమాదం

తెగి పడ్డ విద్యుత్ వైర్లు.. తప్పిన ప్రమాదం

NLR: జిల్లాలోని రాపూరులోని పెద్ద మసీదు వద్ద శుక్రవారం ఉదయం విద్యుత్ మెయిన్ వైర్లు తెగిపడటంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తు, వైర్లు తెగిపడే సమయంలో ఎవరూ ఆ ప్రాంతంలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందిన వెంటనే విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. దీంతో రాకపోకలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి.