శ్రీచైతన్యలో విద్యార్థిని మృతి.. తండ్రికి గుండెపోటు

కృష్ణా జిల్లా తాడిగడప (పెనమలూరు) శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. అనారోగ్యంతో చనిపోయిందని యాజమాన్యం చెబుతుండగా వారి వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. తమ కూతురికి ఏ సమస్య లేదని విద్యార్థిని తల్లి వెల్లడించారు. అటు కూతురి మరణ వార్త విన్న తండ్రికి గుండెపోటు వచ్చింది.