విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌

విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌

విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌‌ను సమగ్ర ప్రణాళికతో గ్లోబల్‌ ఎకనామిక్‌ హబ్‌గా చేయడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, పట్టణాభివృద్ధి, గ్రీన్‌ ఎనర్జీ, మౌలిక వసతులు ఇలా అన్నివిధాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. విశాఖను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలని తెలిపారు.