షర్మిలను ఎంపీగా చూడాలనేది వివేకా కోరిక: సునీత

కడప: కడప ఎంపీగా పోటీ చేస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలను గెలిపించాలని వైఎస్ వివేకా కుమార్తె సునీత అభ్యర్థించారు. షర్మిలను కడప ఎంపీగా చూడాలన్నదే వివేకా చివరి కోరిక అని.. దాన్ని నెరవేర్చేందుకు సన్నద్ధమయ్యానని తెలిపారు. హంతకులకు ఓటు వేయొద్దని ప్రజలను కోరారు. ఈ నెల 20వ తేదీన షర్మిల ఎంపీగా నామినేషన్ దాఖలు చేస్తారని వెల్లడించారు.