VIDEO: వైద్యశాలలో ఎక్స్ రే యూనిట్ ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్ రే యూనిట్‌ను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వ వైద్యశాలలో అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటుచేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్, వైద్యులు పాల్గొన్నారు.