ఇస్కాన్ ఆలయంలో హరినామ సంకీర్తన

ఇస్కాన్ ఆలయంలో హరినామ సంకీర్తన

కడప: ప్రొద్దుటూరు ఇస్కాన్ ఆలయంలో శనివారం హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహకులు ప్రారంభించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఇస్కాన్ ఆలయాన్కి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం, సర్వమానవ అబివృద్ధి కోసం హరినామ సంకీర్తన యజ్ఞం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు కృష్ణ దాసు తెలిపారు.