TG ఉన్నత విద్యా సంస్కరణలపై మిజోరం ఆసక్తి
TG: మిజోరం ఉన్నత విద్యా డైరెక్టర్ శివ గోపాల్ రెడ్డి టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా డిజిటల్ విద్య, నాణ్యత హామీ వ్యవస్థల్లో తెలంగాణ సాధించిన పురోగతిని శివ గోపాల్ రెడ్డి అభినందించారు. వి. బాలకిష్టా రెడ్డి మాట్లాడుతూ.. పరిశోధన, ఆవిష్కరణలను బలోపేతం చేయడానికి ఎంఓయూలు చేసుకుంటున్నట్లు తెలిపారు.