ఎంపాక్స్ ఎఫెక్ట్.. గాంధీలో ప్రత్యేక వార్డులు

HYD: ప్రపంచవ్యాప్తంగా ఎంపాక్స్ (మంకీపాక్స్) అలజడి రేకెత్తిస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రులను సిద్ధం చేసింది. అక్కడ ప్రత్యేక వార్డులు నెలకొల్పింది. గాంధీలో 20 పడకలు కేటాయించారు. ఇందులో పురుషులకు, మహిళలకు పదేసి పడకలు కేటాయించినట్లు గాంధీ వైద్యులు పేర్కొన్నారు. ఫీవర్ ఆసుపత్రిలో ఆరు పడకలు అమర్చారు.