'నవధాన్యాలతో భూ సారం పెరుగుతుంది'

PPM: ప్రతి ఒక్కరు పకృతి వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చెయ్యాలని మండల వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతి రావు కోరారు. శుక్రవారం పాచిపెంట మండలం మాతుమూరు గ్రామంలో పకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. వేసవిలో భూమిలో నవధాన్యాలు వెయ్యడం వలన భూమిలో పోషకాలు వృద్ధి చెంది, ఎరువులు వినియోగం తగ్గి దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేపట్టారు.