క్రీడా పోటీలను సందర్శించిన కలెక్టర్
BDK: ఈ-బయ్యారం జడ్పీ పాఠశాలలో జరుగుతున్న రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. రాష్ట్రానికి పేరు తెచ్చే క్రీడలు పినపాక ఏజెన్సీలో జరగడం గర్వకారణమని ఆయన తెలిపారు. 33 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరవుతున్నందున వారికి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.