భూ కబ్జాదారులకు శిక్షపడేలా చేస్తాం: ఎమ్మెల్యే
TG: ప్రభుత్వ భూములు కబ్జా చేసినవారిని వదిలిపెట్టమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తేల్చి చెప్పారు. ఇబ్రహీంపట్నంలో 45 ఎకరాల భూమిని కబ్జా చేశారని తెలిపారు. బినామీ పేర్లతో ఎవరెవరు డబ్బు తీసుకున్నారో అన్నీ బయటపెడతామని చెప్పారు. దీని వెనుక ఎవరున్నా విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు.