'మందుల కొరత లేకుండా చూడండి'
SDPT: వర్గల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు రోగులకు అందుతున్న వైద్య సేవలను, అందులో ఉన్న అటెండెన్స్, ఓపి రిజిస్టర్లు పరిశీలించారు. అనంతరం పెద్ద ఆసుపత్రిగా ఉండటం వల్ల ఓపి పెంచి మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ ఆఫీసర్‌కి సూచించారు. అలాగే, మందులు తగినంతగా అందుబాటులో ఉండేలా DMHOకు ఫోన్ ద్వారా ఆదేశించారు.