'మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం చేస్తున్నారు'

AP: విద్య, వైద్యానికి మాజీ సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారని వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని ఆరోపించారు. అందుకే కాలేజీలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తుందని చెప్పారు.