రేపు ఉచిత కంటి వైద్య శిబిరం
CTR: పుంగనూరు విశ్రాంత ఉద్యోగుల భవనంలో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మునస్వామి మొదలి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు శిబిరం ప్రారంభమవుతుందన్నారు. శంకర్ నేత్రాలయ ఆసుపత్రి నుంచి వైద్యులు వచ్చి ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారిని ఆపరేషన్లకు ఎంపిక చేస్తారని తెలిపారు.