కరెంట్ షాక్ తగిలి కార్మికుడికి గాయాలు
ADB: ఖానాపూర్‌లో ఇంటికి రంగులు వేస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర కిన్వట్‌కు చెందిన కార్మికుడు రఫీక్ ఇంటి పై గోడలకు పెయింట్ వేస్తుండగా, అతని చేతిలో ఉన్న ఇనుప రాడ్ పైనున్న 11 కేవీ లైన్‌ను తాకడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో రఫీక్ చేతులు, అరికాళ్లకు గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.