యాచకులకు దుప్పట్ల పంపిణీ

యాచకులకు దుప్పట్ల పంపిణీ

NLG: చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై గల సాయి మందిరం వద్ద గురువారం వట్టిమర్తికి చెందిన సామాజిక సేవకులు మేడి హరికృష్ణ యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సేవా భావం కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి సేవకులు భోజరాజు, శకుంతల, హైమ, కుమ్మరి రవి, ఎల్లయ్య, రాంబాబు, బాలాజీ పాల్గొన్నారు.