ఇసుక ట్రాక్టర్లు సీజ్.. నలుగురిపై కేసు నమోదు
KNR: కరీంనగర్ రూరల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. తీగలగుట్టపల్లి రైల్వేగేట్, మొగ్దుంపూర్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి వీటిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. డ్రైవర్లు, యజమానులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు