చికిత్స పొందుతూ బాలుడు మృతి
MHBD: గార్ల(M)పూసలతండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామదాసు, స్వప్నల చిన్న కుమారుడు పవన్ (10) నాలుగో తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటంతో తల్లి బడికి వెళ్లాలని మందలించింది. ఈనెల 11న ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగాడు. మరుసటి రోజు అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు.