శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు
SKLM: కొత్తూరు మండలం బమ్మిడి గ్రామంలో వెలసిన శ్రీ రాజ రాజేశ్వరి ఆలయంలో కార్తీక మాసం గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేపట్టారు. మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమలు, వస్త్రాలు సమర్పించి, మొక్కలు చెల్లించుకున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలకు కోర్కెలు తీర్చే అమ్మవారిగా ఎంతో ప్రసిద్ధి చెందింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.