స్థానిక సమస్యల పట్ల మున్సిపల్ ఛైర్‌పర్సన్‌కు వినతి

స్థానిక సమస్యల పట్ల మున్సిపల్  ఛైర్‌పర్సన్‌కు వినతి

జగిత్యాల: పట్టణంలోని ఛత్రపతి శివాజీ కాలనీ వాసులు బుధవారం మున్సిపల్ ఛైర్‌పర్సన్ సమిండ్ల వాణిని కలిసి స్థానిక సమస్యల పట్ల అధ్యక్షులు లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. పది సంవత్సరాల నుంచి సీసీ రోడ్డు, డ్రైనేజీ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఛైర్ పర్సన్ సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.