తలుపులమ్మ లోవకు రూ.2.39లక్షల ఆదాయం

తలుపులమ్మ లోవకు రూ.2.39లక్షల ఆదాయం

KKD: తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానంలో ఆదివారం 8వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ పీ.విశ్వనాధరాజు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ముడుపులు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారని ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. సెలవు దినం కావడంతో దేవస్థానానికి రూ.2,39,763 లక్షల ఆదాయం సమకూరిందని ఈవో తెలిపారు.