పాపానాయుడుపేట విద్యార్థికి పతకం

పాపానాయుడుపేట విద్యార్థికి పతకం

TPT: పాపానాయుడుపేటకు చెందిన జడ్పీ పాఠశాల విద్యార్థి యామిని సత్తా చాటింది. గుంటూరు జిల్లా పెద్దపరిమి ఇండోర్ స్టేడియంలో ఈనెల 8, 9న రాష్ట్రస్థాయి జూడో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 40 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఈ మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా జూడో జట్టుకు ఆమె ప్రాతినిధ్యం వహించింది. అనంతరం యామినిని హెచ్ఎం M. మారయ్య, టీచర్లు అభినందించారు.