ఉద్యమకారులపై పెట్టిన కేసులు కొట్టివేత

ఉద్యమకారులపై పెట్టిన కేసులు కొట్టివేత

ASR: ఆదివాసీ ఉద్యమకారులు 36 మందిపై గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను పాడేరు ప్రథమశ్రేణి జ్యూడీషియల్ కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చినట్లు గిరిజనసంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పీ.అప్పలనర్స సోమవారం తెలిపారు. 2021లో జీవో నెంబర్-3 చట్టబద్ధం చేయాలని కోరుతూ చేపట్టిన బంద్‌తో ప్రజలకు ఇబ్బంది కలిగించారనే ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందన్నారు.