కాలుష్యం.. వైరలవుతున్న రాందేవ్ బాబా సూచనలు
ఢిల్లీ కాలుష్యంపై యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఎయిర్ ప్యూరిఫైయర్లు కేవలం ధనవంతుల విలాసమని, అవి అనవసర ఖర్చు అని కొట్టిపారేశారు. కాలుష్యం బారిిన పడకుండా ఉండాలంటే ఇంటికి కర్టెన్లు వేసుకుని, ఇంట్లోనే 'కపాలభాతి' ప్రాణాయామం చేయాలని సూచించారు. యోగాతో ఎలాంటి రోగాలనైనా జయించవచ్చని చెప్పారు. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.