వరసిద్ధి వినాయక ఆలయ నూతన కమిటీ ఎన్నిక

వరసిద్ధి వినాయక ఆలయ నూతన కమిటీ ఎన్నిక

SRPT: కోదాడ పట్టణంలోని 19వ వార్డులో గల వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ నూతన కమిటీని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 19వ వార్డ్ కౌన్సిలర్ కోటిరెడ్డి సమక్షంలో జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ముండ్రా రామారావు, ప్రధాన కార్యదర్శిగా హాజీ నాయక్, ట్రెజరర్‌గా అప్పారావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.