జిల్లాలోని నిరుద్యోగులకు సువర్ణావకాశం
MBNR: నిరుద్యోగ యువతీ, యువకులకు జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని డీవైఎస్‌వో శ్రీనివాసులు తెలిపారు. కంప్యూటర్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం, మొబైల్ సర్వీసింగ్, ఎలక్ట్రిషన్ తదితర కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి కల వారు ఆధార్, SSC, 2 ఫొటోలతో ఈనెల 15లోగా నేరుగా వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో అప్లై చేసుకోవాలని కోరారు.