VIDEO: ఆదోని జిల్లా సాధన నిరసనలో ఉద్రిక్తత
KRNL: ఆదోని జిల్లా సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో బీమాస్ సర్కిల్ వద్ద సోమవారం నిర్వహించిన నిరసనలో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాల నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదోని జిల్లా కోసం ఎలాంటి త్యాగానికైనా వెనకడుగు వేయమని పలువురు నాయకులు స్పష్టం చేశారు. ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేశారు.