జీకేవీధి మండలంలో పర్యటించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

జీకేవీధి మండలంలో పర్యటించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

ASR: జీకేవీధి మండలం పెదవలస, రింతాడ, దుచ్చరిపాలెం గ్రామాల్లో బుధవారం వ్యవసాయ శాస్త్రవేత్తలు బాలహుసేన్ రెడ్డి, జోగారావు, వెంకటేష్ పర్యటించారు. ఆయా గ్రామాల్లో వరి, వేరుశనగ, మొక్కజొన్న, రాగి, పసుపు పంటలను పరిశీలించారు. రాగి పంటలో అగ్గి తెగులు వ్యాపించిందని గుర్తించారు. నివారణకు 2 గ్రాముల కార్బెండిజం పొడి మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు.