జలమండలి కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

HYD: ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో ఎండీ అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వినియోగదారులు, ఉద్యోగులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడీ మయాంక్ మిట్టల్, డైరెక్టర్లు సుదర్శన్, మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.