2029 లక్ష్యంగా మహిళా రిజర్వేషన్ల ప్లాన్!
వచ్చే 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి పార్లమెంటు, అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పూర్తయ్యాకే ఇది సాధ్యమవుతుందని నివేదికలు చెబుతున్నాయి. అయితే, డీలిమిటేషన్ ప్రక్రియతో సంబంధం లేకుండానే మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసే అవకాశం ఉంది.