అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం లభ్యం

GNTR: మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆత్మకూరు జగనన్న కాలనీ రోడ్డులో సుమారు 35 ఏళ్ల వయసున్న ఓ మహిళ మృతదేహం కాలువ పక్కన నైటీలో లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.