గరీబ్‌పేటలో భారీ చోరీ

BDK: సుజాతనగర్ మండలం గరీబ్‌పేట గ్రామంలో గురువారం భారీ దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన కట్టబోయిన లింగమల్లు అనే మేస్త్రి ఇంట్లో దొంగలు పడి రూ.3.50 లక్షల నగదు, ఆరున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుడు పోలీసులకు సమాచారం అందించగా టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ రమేశ్ కుమార్, క్లూస్ టీం ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.