రాష్ట్రస్థాయి పోటిల్లో సత్తా చాటిన గరివిడి విద్యార్థులు
VZM: విజయవాడలో జరిగిన అండర్ -17 రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో గరివిడి జెడ్పీ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారని HM నిర్మల శనివారం తెలిపారు. వీరిలో 10th విద్యార్థులు కడగల కిశోర్, గురాన దిలీప్, మాడుగుల అఖిల్, 9th విద్యార్థిని ఆరంగి ఉన్ముక్త్‌లు రజత పతకాలు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా చదువులతోపాటు క్రీడలు కూడా రాణించడం అనందంగా ఉందన్నారు.