పశ్చిమాసియాకు మరో అమెరికా యుద్ధనౌక

పశ్చిమాసియాకు మరో అమెరికా యుద్ధనౌక

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించిన నేపథ్యంలో, అమెరికా అప్రమత్తమైంది. తన మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు రక్షణగా మరో విమాన వాహకనౌకను పశ్చిమాసియాకు తరలించాలని పెంటగాన్ నిర్ణయించింది. ఇరాన్ నుంచి ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టడమే లక్ష్యంగా అమెరికా ఈ భారీ సైనిక మోహరింపు చేపడుతోంది.