పద్మశాలి యువజన ప్రధాన కార్యదర్శిగా కార్తికేయన్

పద్మశాలి యువజన ప్రధాన కార్యదర్శిగా కార్తికేయన్

GNTR: ఏపీ పద్మశాలి సంఘం యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జంజనం కార్తికేయన్ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు మంగళవారం ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్తికేయన్ మాట్లాడారు. ఈ నెల 26న మంగళగిరిలో జరగనున్న పద్మశాలి మహాసభకు యువతను భారీగా సమీకరిస్తామన్నారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తానని పేర్కొన్నారు.