కలెక్టర్ పిలుపుతో నేత్రదానంతో అంధత్వ నివారణ

KRNL: జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా నేత్రదానం చేసి అంధత్వ నివారణకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం కర్నూలులో 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన ఆయన, ప్రతి ఏడాది 25-30 వేల నేత్రాలు సేకరిస్తే 1.2 లక్షల మంది అంధులకు చూపు కల్పించవచ్చని తెలిపారు.