గ్రామాల అభివృద్ధికి చర్యలు : ఎంపీపీ

మాకవరపాలెం: గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామని మాకవరపాలెం ఎంపీపి సత్యనారాయణ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల వారీగా ఇచ్చిన నిధులు, కొత్తగా టెండర్లు పిలిచిన పనులకు సంబంధించి వివరాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు లక్ష్మి, రాజారావు పాల్గొన్నారు.