లింగ నిర్ధారణ పరీక్షలు.. కలెక్టర్ వార్నింగ్

లింగ నిర్ధారణ పరీక్షలు.. కలెక్టర్ వార్నింగ్

W.G: జిల్లాలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. నిన్న భీమవరం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో 'గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నివారణ చట్టం' అమలు తీరును ఆమె పరిశీలించారు. ఈ చట్టం అమలులో ఎటువంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు.