ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

RR: ఉరేసుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. 24వ వార్డు ఆశాకాలనీలో ఓ వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.