పంటలకు నష్టపరిహారం అందిస్తాం: షబ్బీర్ అలీ
KMR: బిక్కనూర్ మండలంలో ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చెప్పారు. గురువారం మండలంలోని పెద్ద మల్లారెడ్డి, కంచర్ల గ్రామాలలో, వడగండ్ల వర్షానికి నష్టపోయిన పంటలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని ఆయన చెప్పారు.