ఘనంగా ఉరుసు ఉత్సవాలు

KDP: కమలాపురంలో దర్గా ఎ గఫార్ షా ఖాద్రీ ఉరుసు ఉత్సవాల్లో కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు దర్గా కన్వీనర్ ఇస్మాయిల్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రవీంద్ర నాధ్ రెడ్డి మజార్లపై పూల చాదర్ సమర్పించి ప్రత్యేక పాతేహ నిర్వహించారు. పీఠాధిపతి మహమ్మద్ పైజల్ గఫార్ షా ఖాద్రీ రవీంద్రనాధ్‌రెడ్డికి ప్రసాదాలు అందజేశారు.