గ్యాస్ గోదాం తనిఖీ చేసిన సీఐ
SRD: సిర్గాపూర్‌లో HP గ్యాస్ గోదాంను కంగ్టి సీఐ, SI నారాయణతో కలిసి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆన్లైన్ ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఇంటికి డెలివరీ చేయాలన్నారు. బ్లాక్‌లో అమ్మినట్టు తెలిస్తే మాత్రం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మండలంలో ఎక్కడైనా ఎవరైనా బ్లాక్‌లో సిలిండర్లను నిల్వ చేసి అమ్మితే చర్యలు తప్పవన్నారు.