వంగూరు తుది ఓటర్ల జాబితా విడుదల

NGKL: వంగూరు మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను మంగళవారం విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం మండలంలో మొత్తం 228 వార్డులు, 33,498 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో 16,498 మంది పురుషులు కాగా, 17,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు వచ్చిన 398 అభ్యంతరాలను పరిష్కరించామని ఎంపీడీవో బ్రహ్మచారి వెల్లడించారు.