మానవత్వం చాటుకున్న ఆటో డ్రైవర్
MHBD: తొర్రూరు మండలం గుర్తూరు గ్రామ శివారులో గుంజేడు ముసలమ్మ మూలమలుపు వద్ద బుధవారం రాత్రి ద్విచక్ర వాహనం ఓ చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో గుర్తూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ముత్యం ఉపేందర్ గౌడ్ గమనించి గాయపడిన యువకులను తన ఆటోలో తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆసుత్రికి తరలించి మానవత్వం చాటుతున్నాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.